Header Banner

తెలుగు వెలుగు జర్మనీ – ఉగాది ఉత్సవాలు 2025, ఫ్రాంక్‌ఫర్ట్! ఒకరికొకరు తెలుసుకునే వేదికగా..

  Tue Apr 08, 2025 14:40        Associations, World

తెలుగు వెలుగు జర్మనీ సంఘం ఆధ్వర్యంలో ఉగాది, తెలుగు నూతన సంవత్సరం వేడుకలు ఏప్రిల్ 6న ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఫ్రాంక్‌ఫర్ట్ మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు పాల్గొని, సంగీతం, నృత్యం, సంప్రదాయ ప్రదర్శనలతో ఉత్సవాన్ని ఘనంగా జరిపారు.

 

ఈ సందర్భంగా సంఘం సంస్థాపకుడు మరియు మాజీ చైర్మన్ Late శ్రీ సాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా స్మరించుకొని, ఆయన కలలు, ఆశయాలు ఇప్పటికీ తెలుగు వెలుగు సభ్యుల నడకదారిలో వెలుగులా నిలుస్తున్నాయని జనరల్ సెక్రెటరి శ్రీ సూర్యప్రకాశ్ వెలగా గారు పేర్కొన్నారు. "ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన చూపిన దారి మాకొక దిక్సూచి. ఆయన స్వప్నాన్ని నెరవేర్చే బాధ్యతను మేము అందరం మోస్తాం," అని ఆయన అన్నారు.

 

ఈ వేడుకకు ఫ్రాంక్‌ఫర్ట్ బర్గర్‌మాస్టర్ శ్రీమతి నసరిన్ ఎస్కందారి-గ్ర్యూన్‌బర్గ్ గారు ముఖ్య అతిథిగా హాజరై, జర్మనీలో తెలుగు సమాజానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. బహుళసాంస్కృతిక సమాజాన్ని ప్రోత్సహించడంలో ఫ్రాంక్‌ఫర్ట్ నగరం చేస్తున్న కృషికి తెలుగు వెలుగు సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

శ్రీ సూర్యప్రకాశ్ వెలగా గారు, ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫ్రాంక్‌ఫర్ట్ ప్రాంతంలో తెలుగు సమాజానికి అందుతున్న మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు కమ్యూనిటీ ఇటీవల వేగంగా ఎదుగుతుందని, కొత్తగా చేరిన కుటుంబాలను మన తెలుగు వెలుగు కుటుంబంగా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.

 

"ఇలాంటి వేడుకలు మనందరినీ కలిపి, ఒకరికొకరు తెలుసుకునే వేదికగా నిలుస్తాయి. మన ఐక్యతే మన బలం," అని అన్నారు.

 

ఈ ఉగాది సంబరాల్లో పిల్లలు, యువత మరియు కళాకారులు అందించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిని విజయవంతం చేయడంలో సంఘం కల్చరల్ కోఆర్డినేటర్ శ్రీ ప్రీతం బొడా విట్టల్ గారు తమ అంకితభావంతో ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే సంఘం ట్రెజరర్ శ్రీ ఆదర్శ్ వంగల గారు సంఘం ఆర్థిక పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఈవెంట్ విజయవంతం అవ్వడంలో కీలకంగా వ్యవహరించారు.

 

ఇది కూడా చదవండి: దినదిన గండంగా మారిన అమెరికా.. దారుణ పరిస్థితిలో తెలుగు విద్యార్థులు.! చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష ..

 WhatsApp Image 2025-04-08 at 2.19.30 PM.jpeg

 

ఈ ఉత్సవం విజయవంతంగా పూర్తవ్వడంలో ప్రతీ వాలంటీర్, ప్రతీ సభ్యుని సహకారం అనతిదోపరి. సంఘం వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతోంది. అదేవిధంగా, 2026లో తెలుగు వెలుగు జర్మనీ 20వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నట్లు శ్రీ వెలగా గారు తెలిపారు. "ఈ మైలురాయిని మేము ఎంతో ఘనంగా జరుపుకోబోతున్నాం. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీతో పంచుకుంటాం," అని తెలియజేశారు.

 

ఈ ఉగాది వేడుకలు ఒక గొప్ప విజయంగా నిలిచాయి. ఇది మన తెలుగు భాష, సంస్కృతి, ఐక్యత, మరియు పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలిచింది అని తెలియచేసారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 WhatsApp Image 2025-04-08 at 2.19.29 PM.jpeg WhatsApp Image 2025-04-08 at 2.19.24 PM.jpeg WhatsApp Image 2025-04-08 at 2.19.27 PM.jpeg WhatsApp Image 2025-04-08 at 2.19.28 PM.jpeg

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TeluguVelugu #Germany #UgadiFstival #Celebrations #Frankfurt